![]() |
![]() |

బుల్లితెర మీద ఓంకార్ కి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇష్మార్ట్ జోడి 3 హోస్ట్ గా చేస్తూ ప్రతీ వారం మంచి మంచి కంటెంట్ తో ఆడియన్స్ ని అలరిస్తున్నారు. ఇక ఈ వారం ప్రోమో చూస్తే మాములుగా లేదు. ఇంటింటి రామాయణం పేరుతో ఈ ఎపిసోడ్ రాబోతోంది. ఈ షోలో జోడీస్ తో అంటే మొగుడు పెళ్లాలతో అంట్లు తోమిచ్చేసాడు. ప్రదీప్-సరస్వతి, రాకేష్-సుజాత, ప్రేరణ-శ్రీపాద్ జోడీలతో దగ్గరుండి మరీ హింట్స్ ఇచ్చి తోమించాడు. కొంతమందికి బూడిద, కొందరికి ఇటుక పొడి ఇచ్చాడు. అంట్లను నీట్ గా తోమమని చెప్పాడు. "అన్నా ఇంత బతుకు బతికి ఈ పని చేస్తే బాగోదేమో అన్నా ఆలోచించావా" అన్నాడు రాకేష్. "ఇంటరెస్ట్ లేకపోతె రండయ్యా మేము కడుక్కుంటాం" అంటూ ఆదిరెడ్డి సెటైర్ వేసాడు.
"అంట్లు తోముతుంటే ఏమనిపిస్తోంది" అన్నాడు ఓంకార్. "నాలుగిళ్ళు ఒప్పుకుంటే బాగుంటుంది అనిపిస్తోంది" అన్నాడు రాకేష్. ఇక అన్నీ జోడీలతో చపాతీలు కూడా చేయించాడు ఓంకార్. ఆదిరెడ్డి చేసిన చపాతీ ముద్దల్ని పట్టుకుని "ఇది ఉండలా లేదు రాయిలా ఉంది. ఇక్కడ క్రికెట్ బాల్స్ చేస్తున్నాడు" అంటూ కౌంటర్లు వేసాడు ఓంకార్. ఇక నోటితో భార్యల కాలి గోళ్లకు నెయిల్ పోలిష్ కూడా వేయించాడు. ఇక ఫైనల్ గా నామినేషన్స్ లో ఆదిరెడ్డి-కవితకె ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఇక తర్వాత ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న ఆదిరెడ్డి-కవిత, అభయ్ నవీన్-భవానీ, అనిల్ గీలా- ఆమనికి ఓ టాస్క్ పెట్టాడు. ఒక పెన్సిల్‌ని షార్పనర్ తో చెక్కి చిన్న ముక్కలా చేయాలని ఇచ్చిన టైం జోన్ లో పూర్తి చేయాలని అప్పుడు రెండు జోడీలు సేఫ్ అయి ఒక జంట ఎలిమినేట్ అవుతుందని చెప్పాద్దు. ఎవరు సేఫ్ అవుతారో ఈ వారం ఎపిసోడ్ లో తెలుస్తుంది.
![]() |
![]() |